Tuesday, September 7, 2010

భీభత్స సంఘటనలు -1


         మామూలుగా చాలా మందికి హారర్ సినిమాలు అంటే భయముంటుంది, అందులోను అమ్మాయిలకి (అందరికీ కాదనుకోండి) ఇది చాలా ఎక్కువ, ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు.......సినిమాలు చూసి భయపడటం, అది చూసి నిద్ర పట్టక రాత్రిళ్ళు బిక్కు బిక్కు మంటూ గడపటం చాలా మంది చేసేదే ....ఇది అందరికి సినిమా చూస్తేనే జరుగుతుంది. కాని నేను ఎంత వింత అంటే..........ఎంత పిరికి దాన్ని అంటే...స్టొరీ విని.........ఏంటి.......... జస్ట్ స్టొరీ విని మాత్రమే, అంటే సినిమా చూడకుండానే భయపడిపోయి నేను పడుకోక..........ఇంట్లో వాళ్ళని పడుకోనివ్వక చేసే రభస రభస కాదు..అలా నా జీవితం లో జరిగిన కొన్ని భయంకర సంఘటనలు చెప్తాను మీరు విని భయపడతారో, ఆశ్చర్యపడతారో లేక నవ్వుకుంటారో మీ ఇష్టం........


1) దాదాపుగా 13 సంవత్సరాల క్రితం నేను 4th class చదివేటప్పుడు వేసవి సెలవుల టైం లో ఇంట్లో బాగా బోర్ గా ఉంది....మిట్ట మధ్యాహ్నుం రెండింటికి నా క్లోజ్ ఫ్రెండ్స్ ఐన రేణు, రాధి వాళ్ళ ఇంటికి వెళదామని మా అమ్మ ని తెగ కాకా పట్టేసాను ....సరే పో అని అంది.......... ఎండలో వెళ్ళాను ofcourse ఇల్లు దగ్గరే లెండి...

నేను వెళ్ళక ముందు వాళ్ళ ఇంట్లో ....

        రేణు, రాధి, మా పక్కింటి కిరీటి, పద్మ ప్రియ (అందరు చిన్న పిల్లలే పైగా అందరు పిరికోళ్ళే) కలిసి కూర్చొని ఒక దెయ్యం సినిమా చూసారట . ఆ సినిమా లో సీన్ ఏమిటంటే హీరోయిన్ ఇంట్లో ఉండగా దెయ్యం వచ్చి తలుపు కొడుతుంది .తీరా తలుపు తీసి చూస్తే ఎవరు ఉండరు....హీరోయిన్ బిక్కు బిక్కు మంటూ లోపలికి రాగానే మళ్లీ తలుపు చప్పుడు. మళ్లీ ఎవరు ఉండరు చాలా భయం భయం గా కూర్చుంటుంది హీరోయిన్. ఇంతలో కిటికీలోనుంచి మహీఈఈ ( అని గుర్తు ఆ సినిమాలో ఆ హీరోయిన్ పేరు మహి అని చూచాయగా గుర్తు మరి అసలు పేరు ఏమిటో నాకు గుర్తు లేదు ఎందుకంటే నేను ఇంతవరుకు ఆ సినిమా చూడలేదు కాబట్టి) .......మహీఈఈ అనుకుంటూ ఎర్ర చీర కట్టుకుని ఒక దెయ్యం చెయ్యి లోపలకి పెట్టి పిలుస్తుందంట వాళ్ళు ఆ సినిమా చూస్తూ వాళ్ళకి భయం వేసి కట్టేసి బిక్కు బిక్కు మంటూ కూర్చున్నారు......

      ఎప్పుడు లేనిది నాకు ఎందుకు వచ్చిందో ఆ దిక్కుమాలిన ఆలోచన, ఏ నాడు లేనిది ఆ రోజే ఎందుకు పుట్టిందో ఆ దుర్బుద్ధి రేణు వాళ్ళని సరదాగా ఏడిపిద్దాం అని decide అయ్యా......నేను వచ్చిన విషయం తెలియకుండా చెప్పులు మెట్ల కిందే విడిచేసాను.. కిటికీ లో నుంచి కనపడకుండా పాక్కుంటూ వెళ్లి తలుపు కొట్టి పరిగెత్తుకుంటూ వెళిపోయి పక్కన దాక్కున్నా . ultimate గా ఏముంది ఆ సినిమా లో లాగానే తలుపు చప్పుడు అయింది తలుపు తీసి చూస్తే ఎవరు లేరు.... నలుగురికి గుండెలు ఫట్........... మళ్లీ అలానే చేశా ఈ సారి వాళ్ళు confirm అయిపోయారు దెయ్యం అని...... నేను 3rd టైం తలుపు కొట్టి అక్కడే నిలబడ్డా "భౌ" అని అరుద్దామని ఈసారి వాళ్ళు ఎంతకి తలుపు తీయలా (ఎలా తీస్తారు దెయ్యం అని ఫిక్స్ అయిపోయాక) ఇంక లాభం లేదని నేను కిటికీ కిందకి పాక్కుంటూ వెళ్లి......విధి చుడండి మరి ఎప్పుడు లేనిది నాకు ఆ వంకర బుద్ధి ఆ రోజే రావాలా???? " రెణుఊఊఊఊఊఉ" అనుకుంటూ రెడ్ టాప్ రెడ్ మిడ్డి వేసుకుని కిటికీలోనుంచి చెయ్యి పెట్టి అరిచాను ....అసలే ఆ దెయ్యం డ్రెస్ కూడా రెడ్ సారీయే కావడం తో మా ఫ్రెండ్స్ గుండెలు జారి పోయాయ్........... అంతే ఇంకా వాళ్ళు అరిచిన అరుపులు అరుపులు కావు. అసలే వాళ్ళ ఇంటి పైన వేరే ఇల్లు కూడా లేదేమో( వాళు ఉండేదే పైన) ఇంక టాప్ లేచి పోయింది.


        నేనేమో పిరికి దాన్ని. దారుణమైన పిరికిదాన్ని. ఇంక వాళ్ళు దెయ్యం దెయ్యం అని అరిచేసరికి ఎక్కడ దెయ్యం నా వెనకే వచ్చిందో అనుకుని నేను కుడా అరుపులు.ఇంటిలోపల వాళ్ళు అరుపులు, బైట నేను అరుపులు. పిరికి దాన్ని తిన్నగా ఉండచ్చు కదా ఇలా ఏడిపించడం అవసరమా.... ఇంకా ఆ అరుపులకి వాళ్ళ అమ్మగారు లేచి ఏమిటర్రా నన్ను పడుకోనివ్వరా అని అరిచి తలుపు తీసారు.అమ్మ దెయ్యం అమ్మ దెయ్యం అని పాపం వాళ్ళు అరుపులు నేను అరుపులు. ఆంటీ ఏమో........ హే ఆపండి స్వాతి మీకు దెయ్యం లా కనపడుతుందా ఆపండి ఇంక అని అరిచి లోపలికి వెళ్లిపోయారు. ఆ తరువాత నేను మనిషిని కావటానికి 15 minutes పట్టింది .వాళ్ళు నన్ను ముట్టుకోవడానికి అయితే దగ్గర దగ్గర అరగంట వరకు సాహసించలేదు...

        ఆ తరువాత వాళ్ళు చూసిన ఆ సినిమా గురించి చెప్పారు. అప్పటినుంచి నేను ఆ సినిమా గురించి తెలుసుకునే ధైర్యం చేయలేదు.....అంతే అప్పటినుంచి ఎంత అవసరమైనా తలుపు కొట్టాక ఎవరు ఎంత లేట్ గా తలుపు తీసినా అక్కడ నుంచి కదలను. కిటికీ లో నుంచి చూసే సాహసం అస్సలు చేయలేదు..... చెయ్యను.

2) నా వయసు దాదాపు 11 ఏళ్ళు. మా అన్నయ్య "రామ్ గోపాల్ వర్మ" తీసిన "దెయ్యం" మూవీ చూసి వచ్చాడు........ఆరోజు నేను అద్దం ముందు నుంచుని తల దువ్వుకుంటున్నా ..మా అన్నయ్య పక్కనే వచ్చి నిలబడి స్వాతి దెయ్యం మూవీ లో జే.డి.చక్రవర్తి మహేశ్వరిని నీ పేరు పెట్టే పిలుస్తాడు తెలుసా అన్నాడు......అవునా అన్నయ్య ఆ మూవీ లో దాని పేరు స్వాతి నా అన్నా .......కాదు దెయ్యం అని jerk ఇచ్చి వెళిపోయాడు.అది పరవాలేదు.సరిగ్గా దెయ్యం ఎలా ఉంటుందో , మహేశ్వరీ అద్దం ముందు నుంచుని "చిన్నీ.... దా చిన్నీ.... దా" అంటే దెయ్యం ఎలా కనిపిస్తుందో నేను అద్దం ముందు ఉండగానే సరిగ్గా angles, measurements తో సహా వర్ణించి ఆ దెయ్యం యొక్క రూప లావణ్యాన్నికుడా వర్ణించాడు. దెబ్బకి నేను ఒక 2 నెలలు అద్దం ముందు తల దువ్వుకోవడం మానేసాను.అలా మళ్లీ మామూలు మనిషిని కావటానికి 2 నెలలు పట్టింది .

      కొన్నాళ్ళకి ఇల్లు మారాము ఇక్కడ దర్జాగా హాయిగా కిటికీ పక్కన పడుకునే దాన్ని. మా అన్నయ్య మళ్లీ వర్ణన మొదలు పెట్టాడు......మా అన్నయ్య స్టొరీ narration ఎంత great అంటే అది విన్న మనుషులు అందులో లీనమైపోయి ఆ place కి వెళిపోతారు........ మళ్లీ దెయ్యం మూవీ గురించే చెప్పాడు.....చిన్న పిల్లాడు కిటికీ పక్కన నుంచుని ఉంటే చేతులు వస్తాయి అని ఆ చేతులని వర్ణించాడు దెబ్బతో నేను ఆ కిటికీ పక్కన పడుకోవడం మానేసాను.......ఆ తరువాత అనిపించింది మా అన్నయ్య ఆ కిటికీ పక్కన పడుకోడానికి ఈ plan వేసి ఉంటాడా అని అప్పటినుంచి మా అన్నయ్య నే పడుకోమనేదాన్ని అప్పటిదాకా మాత్రం బైట గాలి అంత నాదే , నేను నీకు place ఇవ్వను కిటికీ పక్కన నేనే పడుకుంటాను అని ఒంటి కాలి రాకాసి లాగా లేచిన నేను దెబ్బకి కుంటి కుందేలు లాగా వేరే ప్లేస్ లో పడుకోవడం మొదలు పెట్టాను.............ఇదంతా జస్ట్ విని మాత్రమే...... చూస్తే ఇంకేమైపోయి ఉండేదాన్నో ఆలోచించనక్కర్లేదనుకుంటా .........

3) నా ఇంటర్ సెకండ్ ఇయర్ లో నా బెస్ట్ ఫ్రెండ్ అనూష ఒక మధ్యాహ్నం మా ఇంటికి వచ్చింది. కాలక్షేపం అవుతుంది కదా అని ఏదైనా సినిమా story చెప్పవే అన్నా . మా అన్నయ్య చెప్పిన way కి మనం లీనం అవుతాము అయితే...మా ఫ్రెండ్ anu అదే లీనమైపోతుంది ఆ character లో. నా ఖర్మ కొద్ది అది ఎంచుకున్న సినిమాలో హీరోయిన్ సైకో.......ఇంక నా పరిస్థితి వర్ణనాతీతం.....అది ఎంచుకున్న సినిమా "కౌన్.....తూ రు రు తూ". ఆ సినిమా లో ఊర్మిళ action ని మొత్తం చేసి చూపించింది. నా ఖర్మ కి తోడు ఆ రోజు full గాలి వర్షం సినిమా లో లాగానే.అమ్మ నిద్రకి disturbance అని లైట్స్ అన్ని off చేసుకుని కూర్చున్నా ఏమో బైట గాలీ వాన.... ఇది లీనమైపోయి చెప్పేస్తోంది. నాకు భయం start అయింది. మూవీ లో ఎవడో వచ్చి బెల్ కొడతాడు అంది. సరిగ్గా మా ఇంట్లో కూడా bell మోగింది {నా గుండె ఆగింది}. ధైర్యం చేసుకుని వెళ్లి తలుపు తీసా.

    "అమ్మా portions ఏమైనా ఖాళీ ఉన్నాయా" అంటూ ఎవరో వచ్చారు నాకు తెలియదు రేపు రండి అని తలుపు వేసేసా. మా అను అలానే మూవీ చెప్పుకుంటూ పోతూ ఉంది. చాలా భయం భయం గా విన్నా.final గా ఆ సైకో... అదే ఆ హీరోయిన్ ఇంటికి వచ్చిన వాడిని ఏదో పెట్టి పొడుస్తుందంట . ఇంకా నయం దాని దగ్గర ఏమి లేవు రా బాబు హమ్మయ్య అనుకున్నా. దాని expression కే నా పని out.......అను ఇంక ఆపవే అన్నా .నేను చెప్తుంటే వినడానికి ఏమైందే నీకు అంది........పోనీ సినిమా మార్చవే అన్నా ...... నువ్వు చెప్పమన్నా చెప్పడానికి సినిమా అయిపొయింది అంది......హమ్మయ్య అనుకున్నా.

     మళ్లీ మొదలుపెట్టింది....ఇప్పుడు "RAAZ" మూవీ.........ఇది అంతకంటే హారర్ మూవీ అని సినిమా మొదలు పెట్టాక కాని నాకు అర్ధం కాలేదు అసలే మనిషివి పెద్ద పెద్ద తెల్ల కళ్ళు . రూం చీకటి.......దానికి తోడు అది వైట్ కలర్ టీ షర్టు వేసుకుంది..... దాని కళ్ళు ....... అది లీనమైన తీరు చూస్తే దెయ్యమే నాతో మాట్లాడుతుంది అని అనటానికి ఏ మాత్రం doubt పడక్కర్లేని situation అది......ఆ సినిమా లో ఒక situation లో దెయ్యం హీరోయిన్ ని పట్టుకుని " i mean శరీరం లో కి ప్రవేశించి" హీరో చెయ్యి పట్టుకుంటుందట. మా ఫ్రెండ్ నా చెయ్యి పట్టుకుంది. నేను నా గుండె పట్టుకున్నాను.అలా బిక్కు బిక్కు మనుకుంటూ దాన్ని చూసుకుంటూ...... అను ఆపవే ఆపవే అంటే ఆపలేదు అది లీనమైపోయింది నాకు story మొత్తం చెప్పేదాక దానికి ఇంక నిద్ర పట్టేలాగా లేదు. ఇంక తప్పక విన్నా ఆ తరువాత నేను normal అవటానికి nearly 3-4 months పట్టింది.

      అప్పటివరుకు తెరిచి ఉన్న కిటికీ అంటేనే భయం ఉండేది మా అన్నయ్య చెప్పిన దెయ్యం story మహిమ వల్ల. ఈ raaz మూవీ పుణ్యమా అని మూసి ఉన్న కిటికీ చూసినా దడ, వణుకు మొదలయ్యేవి.............ఇది కూడా విని మాత్రమే. చూస్తే కిటికీలు లేని ఇంట్లో ఉంటాను అని తీర్మానిన్చుకుని ఉండేదాన్నేమో మరి............

4) నా డిగ్రీ లో మా అన్నయ్య A film by aravind మూవీ చూసి వచ్చాడు. చూసిన వాడు తిన్నగా ఉండచ్చు కదా.......చాల బాగుంది చాల బాగుంది అని నా దగ్గర చాలా సార్లు అన్నాడు.....పిరికి దాన్ని , నా సంగతి నాకు తెలిసిన దాన్ని, నేనన్నా తిన్నగా ఉండచ్చు కదా... అది సస్పెన్సు థ్రిల్లెర్ అని తెలిసి కుడా నాకు story చెప్పవా చెప్పవా అని కెలికా. ఏముంది షరా మాములే......వినే అంత సేపు మనం లీనం........విన్నాక వేస్తుంది అసలు భయం....అంతే ఇంక ఒక్కద్దాన్నే ఎక్కడికి వెళ్ళాలన్నా భయమే......

ఇంక నా condition:
నేను: అన్నయ్య భయంగా ఉంది bed room వరుకూ తోడు రావా please........
అన్నయ్య: ఎందుకు?
నేను: భయం గా ఉంది
అన్నయ్య: ఎందుకు?
నేను: A film by aravind story చెప్పావ్ కదా అప్పటినుంచి భయం గా ఉంది
అన్నయ్య: అవును మరి...... మనది లంకంత కొంప.... ఏ గది లో నుంచి ఏ గది లోకి ఎవడు వెళ్ళింది ఎవడికి తెలియదు మరి .....ఇప్పుడు సైకో వచ్చి నిన్ను చంపేస్తుందా????????.....ఏమి అవ్వదులే కానీ వెళ్ళు
నేను: ప్లీజ్ అన్నయ్య భయం గా ఉంది
అన్నయ్య: అయినా అది ఆడవాళ్ళని ఏమి చెయ్యదు స్వాతి నువ్వు వెళ్ళు హ్యాపీ గా

పాపం ముందు రాను అనేవాడు.......... నేను ఉడుక్కునే లాగా చేసేవాడు కాని మొత్తానికి సాయం వచ్చేవాడు....అలా అమ్మ,అన్నయ్య సాయంతో ఒక నెల రోజులు భయం తో నెగ్గుకోచ్చేసా ......తరవాత తరవాత అలవాటు అయిపొయింది........

ఇవన్నీ వింటే భయపడినవి. ఇక నేను స్వయం గా చూసి వణికిపోయిన సినిమాలూ ఉన్నాయ్........మీకు డౌట్ రావచ్చు ఇంత పిరికిది మూవీస్ చూసి బ్రతికే ఉందా అని........బ్రతికే ఉన్నాను అదేంటో మరి నాకూ డౌటే ఎలాగా అని....

వాటి వివరాలు వచ్చే సంచికలో... i mean వచ్చే టపాలో :)

6 comments:

  1. కామెడీ మిక్స్ చేసిన హార్రర్ సినిమా చూపించేశారు కదా :) ఓ సారీ, పాపం మీరు మీ భయాలు కష్టాలు చెప్తుంటే నేను కామెడీ అనేశాను :) తరువాయి భాగం కోసం ఎదురు చూస్తూ...

    ReplyDelete
  2. మీరింకా బ్రతికి ఉన్నారు ..నేనైతే మరి ఇక అంతే... విచిత్రం ఏంటంటే చిన్నపుడు కొద్ది పాటి హర్రర్ సినిమాలు చూసేదాన్ని.. పెద్దయ్యాకా మరీ భయంకరం గా భయపడిపోతున్నా .. ఆ మధ్య చంద్రముఖి చూద్దువు రా అని పిలిచినా బెడ్ రూం తలుపేసుకుని కూర్చున్నా చూడను అని :)

    ReplyDelete
  3. haha...chaala baagundi Swathi gaaru...navvaleka chachanu.. :)

    ReplyDelete
  4. thanx a lot to all.......nestham garu meeru better meeru bhayapadatharani telisi alanti vaatiki dooram ga untunnaru, nenu ala kaadandi, chusthanu chusi nenu bhayapadi......intlo vaallani bali pedathanu

    ReplyDelete
  5. ammo..... naaku kuda picha bhayam telusa andi light veskoni nidra potha roju thelsa swathi garu em parledu lendi pada vallu eppudu cheda vallu kadhu kadha manala bayapade vallaki manchi rojulu vastayi.....he he :) :) keep going swathi garu looking forward for more incidents@sujay

    ReplyDelete
  6. Avuna.. meeku horror stories anna, movies anna intha bhayama.. very good.. ayithe ventane nenu na blog lo rasina "flat no 402" and "Shortcut to gopalapuram" chidivi teeralsinde.. me manobhavalu panchukovalsinde :)

    ReplyDelete