(మొదటి భాగానికి కొనసాగింపు)
ఇక నేను సినిమా చూసి భయపడిన సంఘటనలు.......
నేను హారర్ మూవీస్ లో ఫస్ట్ చూసిన మూవీ evil dead. జలుబు చేస్తే వేసుకునే avil తప్ప evil అన్న మాట కి అర్ధం కూడా తెలియదు నాకు ఆ వయసు లో. అది దెయ్యాల సినిమా అని దానికి భయపడాలి అన్న విషయం కూడా తెలియని వయసులో చూసాను ఆ మూవీని. సో నాకు అసలు ఏమి తెలియలేదు..........అసలు భయమే వేయలేదు.........
next నేను చూసిన సినిమా డిగ్రీ సెకండ్ ఇయర్ లో classes ఎగ్గొట్టి మరీ టాక్ తెలుసుకోకుండా హీరో హీరోయిన్స్ ఎవరో కూడా తెలుసుకోకుండా వెళ్ళాను.......అది "అనసూయ"
నాన్నది transfer కాని job కావడం తో ఊరిలో తెలిసిన వాళ్ళు చాలా ఎక్కువ. ఎక్కడికి వెళ్ళినా తెలిసిన వాళ్ళు కనపడటం నాన్నకి తెలిసిన వాళ్ళు నన్ను చూసిన విషయం వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకోవడం{ మొన్న C.S కూతురు గుడి లో కనిపించింది} ఈ రకంగా మనం noted కాబట్టి చిన్నప్పటి నుండి silent గా నటించడం అలవాటు అయిపొయింది.
కాని అనసూయ మూవీ లో మాత్రం జనానికి మనమేంటో తెలిసిపోయింది . ఫస్ట్ సీనే భయంకరమైన సౌండ్ తో ఉంటుందేమో.... ఏదో ఓర్చుకుని కూర్చున్నా ....... మేము ఏడుగురు అమ్మాయిలం క్లాసులు bunk కొట్టి మరి సినిమా కి వెళ్ళామేమో ......చేసిన పాపం ఊరికినే పోతుందా అన్న ఫీలింగ్ నాలో start అయింది.సరే అలానే కూర్చున్నా...... ఉన్నకొద్ది భయం పెరుగుతోంది .ఆ పని మనిషి fridge door వెనకాల దెయ్యంలా ఉంటది. ఇంక నా heart beat train spead లో కొట్టుకుంది....theatre లో పెద్దగా జనం లేరు..............ఇదే నా విశ్వ రూపం చూపించడానికి and ofcourse నేను భయపడటానికి కూడా కారణమైంది. మా ఫ్రెండ్స్ దగ్గర theatre మొత్తం వినిపించేలాగా (నా అదృష్టం ఎక్కువమంది లేరు ఆ రోజు) నా బైక్ కీస్ ఇచ్చై నేను వెళిపోతా......... నా బైక్ కీస్ ఇచ్చై నేను వెళిపోతా........నా బైక్ కీస్ ఇచ్చై నేను వెళిపోతా........అని గోల గోల చేసేసాను
అప్పుడు మా ఫ్రెండ్ ఒక అద్భుతమైన సలహా ఎగరేసింది. "కాళ్ళు వేలాడ దీసుకుని కూర్చుంటే భయం వేస్తుంది నువ్వు fold చేసేసుకుని కూర్చో స్వాతి నీకు అంత భయం ఉండదు" అని.అయినా "వెళ్లిపోతాను" అని పేచీ పెట్టాను .ఇంక already movie చూసిన వాళ్ళు నా పక్కనే కుర్చుని "మేము ఉన్నాం కదా నీకు ధైర్యం ఇస్తాం ఎప్పుడు కళ్ళు మూసుకోవాలో ఎప్పుడు చెవులు మూసుకోవాలో చెప్తాం, నీకు భయమేమి అక్కర్లేదు, problem ఏమి లేదు రా స్వాతి, ఇంత భయం ఉండదు తరవాత" అని మొత్తానికి బలవంతంగా కూర్చోబెట్టారు నన్ను మా ఫ్రెండ్స్..
సరే ఇంక తప్పక అలానే భయపడుతూ చూస్తూ కూర్చున్నా..........
ఇంక నేను వాళ్ళ బుర్ర తినడం మొదలు పెట్టాను.......
"ఏమే వాడు దాన్ని ఇప్పుడు ఏమైనా చేస్తాడా ????"
అహ ఏమి చేయడు
"మరి ఇందాక వాళ్ళని చంపేసాడు కదా"
ఇది హీరోయిన్ కదే బాబు.......దీన్ని చంపితే స్టొరీ ఏముంటుంది.నీ మొహం, హాయి గా చూడు.......
(కొద్ది సేపు ఆగి)
"ఇప్పుడు ఏమైనా చేస్తాడా....."
కళ్ళు మూసుకో కిడ్నీ తీసేస్తాడు
"అమ్మో"
నీది కాదు కాదే బాబు...... అరవకు.......
"అలాగే"
ఆ చేప చచ్చిపొతుంది
"అయ్యో పాపం....."
ఏంటి చేపకి కూడా నా ?????
..............ఇప్పుడు గుండె కోసేస్తాడు...కళ్ళు మూసుకో
"బాబోయ్"
అబ్బా కళ్ళు మూసుకోవే
ఇలా ప్రతి situation కి ముందు వెనక మా ఫ్రెండ్స్ బుర్రని ఒక range లో తినేసాను.....
వాళ్ళు అందరూ తెగ లీనమైపోయి చూస్తున్నారు.........
మూవీ అంతా అయిపోయాక complete గా మా ఫ్రెండ్స్ మధ్య secured గా వచ్చాను ofcourse its a different matter......ఆ తరువాత నేను 3 months బాత్రూం లో ఎప్పుడు మొహం కడుక్కోలేదు..ఒంటరిగా ఉండగా కళ్ళు మూసుకునే ధైర్యం చేయలేదు....fridge door open చేసే సాహసం అసలే చేయలేదు.......అలా అనసూయ నాలో ధైర్యం గా ఉండే వాళ్ళ మీద అసూయ రేపింది....
last but not the least నేను చూసిన భయంకంరమైన సినిమా అరుంధతి..మాములుగా నేను అమ్మ కాని, నాన్న కాని, అన్నయ్య కాని లేకుండా నిద్ర పోవడం అన్నది జరగని పని......చిన్నప్పుడు ఒకసారి అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు కూడా పగలు అంతా దున్నపోతులాగా పడుకునే దాన్ని కాని రాత్రి అయ్యే సరికి అమ్మ కాని నాన్న కాని అన్నయ్య కాని కావాలి అనిపించి నిద్ర పట్టేది కాదు....(ఎలా పడుతుంది పగలు గాడిద లాగా బబ్బుంటే???)
అలాంటిది నేను కాలేజీ వాళ్ళతో టూర్ కి అరకు వెళ్ళాను enjoy చేయటానికి....కాని మా classmates అందరు కక్ష కట్టి అరుంధతి సినిమా వేయించారు ..{ఆ సినిమా అప్పటికి అస్సలు చూడనిది నేనే..మిగతా అందరు already చూడడం, భయపడడం అలవాటు పడిపోవడం కూడా జరిగిపోయింది}.ఎంత చూడకూడదు అనుకున్నా..... మన మనసు ఏమిటో మన మాట అస్సలు వినదు. ఏది వద్దు అనుకుంటే అదే చేస్తుందే ... ఏదో తెలియని curiosity తో చూడకుండా ఉండలేక పోయాను. చూడకూడదు చూడకూడదు అనుకుంటూనే చూసాను .మొదట్లో అంత భయం వేయలేదు కాని తరవాత తరవాత భయం స్టార్ట్ ఐంది......
ఇంక జతిన్ అన్నయ్య(మా ఫ్రెండ్) బుర్ర తినడం మొదలుపెట్టాను ....messages పంపాను, పాపం తను చాలా బిజీ గా ఉండేవాడు...ఉదయం 7 కి ఆఫీసుకు వెళితే రాత్రి 11.30 వరకు గొడ్డు చాకిరీ ఉండేది అన్నయ్యకి......అయినా నాకు భయం గా ఉంది అన్నయ్యా అనగానే ఇంక నన్ను divert చేస్తూ ఏదో ఏడిపిస్తూ joke లు వేస్తూ నవ్వించడం మొదలుపెట్టాడు......నాకు భయం లేకుండా చేయడానికి పాపం చాలా try చేసాడు ......'ఇక్కడ నేను తిన్నగా ఉండాలి కదా తన message చూస్తే relax అయ్యేటప్పుడు అదే continue చెయ్యచ్చు కదా' మనసు కోతి వంటిది అని ఊరికే అంటారా ???
తన అంత try చేసింది వేస్ట్ చేయడానికి నేను సినిమా చూడడం మానలేదు......
ఇంతలో రేణు, రాధి, అమ్మ,నాన్నఫోన్ లో మాట్లాడారు. నా కళ్ళు తెరిపించడానికి చాలా try చేసారు....అది సినిమా అని అదంతా makeup అని నిజం గా దెయ్యాలు ఉండవ్ అని...మనం నిజాలు నమ్మం, positives ఎక్కించుకోము కదా నా భయం అలానే సాగింది చాలా చాలా వణికాను, మూవీ చూస్తుంటే భయం వేసినా interesting గా ఉంది.......దానితో చూసినంత సేపు ok అనిపించింది ఆ తరువాత మొదలయ్యింది అసలైన భయం....
ఇంతలో మా అన్నయ్య call చేసాడు, అన్నయ్యతో మాటల్లో పడితే నాకు ఏమి తెలియదు. దానితో భయం అన్న దాని complete గా మర్చిపోయాను........ ఒక half-an-hr పూర్తి గా enjoy చేసేసాను
అన్నయ్య ఫోన్ పెట్టేసాక తెలిసింది లైఫ్ లో వంటరితనం, భయం అంటే ఇలా ఉంటాయా అని, ఫోన్ పెట్టేసరికి అందరు నిద్రపోయారు బస్సు లో...నా పక్కన మా ఆయా పడుకుంది...తనకి నా తెల్ల షాలువ ఇచ్చనేమో........ బస్సు మొత్తానికి రెండే రెండు బ్లూ బుల్బ్ లు పెట్టారు. ఆ లైట్ వెలుతురుకి ఈ షాలువా, అందులో మా ఆయా చాలా భయంకరం గా కనిపించాయి ...సరే మా ఫ్రెండ్స్ ఎవరైనా మెలకువ గా ఉన్నారేమో అని చూసా ........అందరు silent గా ఉన్నారు నెమ్మది గా పిలిచి చూద్దామని try చేసాను ... మహి.....మహి{మహాలక్ష్మి}.....ఊఊఉహూఊఊఉ కదలిక లేదు....విస్సు....విస్సు.....{విశ్వద}....అలాగే మా ఫ్రెండ్స్ మాధవి, సుష్మ,అనుష అందరిని ఒక look ఇచ్చుకున్నా అప్పుడు అర్ధమైంది......వాళ్ళు అందరు... yoga లో side నావాసనం ,,,,,,,meditation లో "సిద్ధ" స్థితి లో ఉన్నారు అని....ఇప్పుడు కనక వీళ్ళని కదిపితే నన్ను yoga లో శవాసనం ,,,, meditation లో "సమాధి" స్థితికి పంపిస్తారు అని ఫిక్స్ అయిపోయి అలా అలా ఒక రెండు గంటలు కొట్టుకున్నా ........భయం ఉన్న కొద్ది ఎక్కువైపోయింది ....ఇంక లాభం లేదని తలచి....ఎవరో ఒకరిని లేపాలని తీర్మానించుకుని వెనక ఉన్న రాజ్ శేఖర్ ని చూసా తాగినోడికి లా పడుకున్నాడు.......... రాజ్ శేఖర్.. రాజ్ శేఖర్.. అని పిలిచా.....కదలలా ......శ్రీకాంత్ ని లేపుదామా అంటే అమ్మో లేపితే బమ్మోలీ నిన్ను వదలా. అని ఆ పశుపతిని మళ్లీ గుర్తుచేస్తాడు, అది ఇంకా danger ....ఇంక ఫైనల్ గా పద్మ రాజు ని లేపా.....తను లేస్తాడు అని అస్సలు expect చెయ్యలేదు
పద్మ రాజు..పద్మ రాజు.......
ఏంటి స్వాతి ఏమి కావాలి....నిద్ర కళ్ళతో లేచి కూర్చున్నాడు. (ఏదో లేపడానికి లేపేసాను, ఏదో ధైర్యం గా ఉంటుంది కదా అని లేపెసాను కాని ఆ టైం లో ఏమి మాట్లాడాలో అసలు అర్ధం కాలేదు.....) పైగా చాలా భయం కూడా వేసింది.....
ఏమి లేదు పద్మ రాజు పైన bag లో water bottle ఉంది తీసి ఇవ్వా ప్లీజ్ అన్నా..........
తను అడిగేసి నిద్రపోయాడు.తను నాకు respond ఐన విషయము నేను తనని water bottle అడిగిన విషయం కూడా తనకి తెలియదు. అంత full నిద్ర లో ఉన్నాడు...ఇంతలో మా ఆయా లేచి ఇదిగో బుజ్జి నీళ్ళు తాగు అని మంచి నీళ్ళు ఇచ్చింది.......తాగేసి అటు ఇటు చూస్తూ కూర్చున్నా .
చలి ఎక్కువ గా ఉండడంతో కిటికీ లు close చేయించేసారు దానితో vomiting sensation ఎక్కువైపోయింది..
జతిన్ అన్నయ్య తో చాట్ చేద్దాం అంటే పాపం అలిసిపోయి పడుకుంటాడు ఎందుకులే disturb చేయడం అనిపించింది....
పోనీ అన్నయ్య కి కాల్ చేద్దామంటే ఈ టైం లో వండుకుంటూ ఉంటాడు (UK లో ఉన్నాడు)...ఇంటికి వచ్చాక కూడా ఆఫీసు వర్క్ ఉంటుంది అని అన్నాడు ఎందుకులే బుర్ర తినడం అనిపించింది.
అమ్మ కి నాన్న కి ఫోన్ చేసి మాట్లాడదాం అనిపించింది.....పాపం వాళ్ళు మాత్రం నేను లేనప్పుడే కదా కాస్తో కూస్తో మనశ్శాంతిగా పడుకుంటారు అనిపించింది......
అప్పుడు అద్భుతమైన idea వచ్చింది....అప్పటిదాకా నా సెల్ లో ఉన్న funny messages అన్ని చదువుకుందాం అని......సరే....... అనిపించిదే తడవుగా చదవడం మొదలు పెట్టేసా ........ఆ messages చూస్తూ నవ్వుకుంటూ భయాన్ని మర్చిపోయా ...మన అదృష్టం ఎక్కువ సేపు నిలవదు కదా....messages చూస్తూ చూస్తూ పక్కకి తిరిగా closed window కదా cell phone light నా మొహం మీద పడుతూ అద్దంలో కనిపించింది. మళ్లీ నాకు పశుపతి గాడి అమ్మ, దాని నవ్వు గుర్తొచ్చి బిక్కు బిక్కు మనుకుంటూ కూర్చున్న........
ఇంక ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు..........
ఇంతలోకి నా అదృష్టం మా రాజ్ శేఖర్ కి మెలకువ వచ్చింది తను మాటలు మొదలు పెట్టాడు....."నిద్ర లేపు రాజ్ శేఖర్ ఏంటి మనోళ్ళకి ఈ మొద్దు నిద్ర అని అన్నా" (నాకు నిద్ర పట్టలేదు పిరికితనంతో మరి దాన్ని cover చేసుకోవాలి కదా)..............ఇంతలోకి మా sir కూడా లేచారు, అందరిని లేపేసారు, ఏంట్రా ఈ నిద్ర .......ఇంత మొద్దు నిద్రలు tour లో పనికిరావు మీరేమి students రా అని......దానితో మా వాళ్ళకి ఒళ్ళు మండి లేచి అల్లరి start చేసారు..నేను అల్లరి చేయకపోయినా , చేసే వాళ్ళని encourage చేయకపోయినా నాకు ఎక్కడో ఆనందం ఎక్కడో ధైర్యం. next day కూడా ఒంటరిగానే ఉన్నా కాని day అంతా strain అవడం తో భయం తెలియకుండా నిద్రపోయాను.
ఇవి నా జీవితం లో జరిగిన కొన్ని భయంకర సంఘటనలు.........
ఇప్పటికీ నన్ను ఎవరైనా.
స్వాతి దెయ్యాలు ఉంటాయా అంటే "no" అంటాను.
మరి దేముళ్ళు ఉంటారా అంటే "yes" అంటాను.
మరి ఎందుకే నీకు ఇంత భయం అంటే??????????
హీ హీ హీ హీ హీ హీ నాకే తెలియని విషయాలు నన్ను ఎందుకు అడుగుతారు అని అక్కడ నుంచి jump అన్నమాట మన పని :-)
స్వాతి ముత్యము
Friday, September 24, 2010
Tuesday, September 7, 2010
భీభత్స సంఘటనలు -1
మామూలుగా చాలా మందికి హారర్ సినిమాలు అంటే భయముంటుంది, అందులోను అమ్మాయిలకి (అందరికీ కాదనుకోండి) ఇది చాలా ఎక్కువ, ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు.......సినిమాలు చూసి భయపడటం, అది చూసి నిద్ర పట్టక రాత్రిళ్ళు బిక్కు బిక్కు మంటూ గడపటం చాలా మంది చేసేదే ....ఇది అందరికి సినిమా చూస్తేనే జరుగుతుంది. కాని నేను ఎంత వింత అంటే..........ఎంత పిరికి దాన్ని అంటే...స్టొరీ విని.........ఏంటి.......... జస్ట్ స్టొరీ విని మాత్రమే, అంటే సినిమా చూడకుండానే భయపడిపోయి నేను పడుకోక..........ఇంట్లో వాళ్ళని పడుకోనివ్వక చేసే రభస రభస కాదు..అలా నా జీవితం లో జరిగిన కొన్ని భయంకర సంఘటనలు చెప్తాను మీరు విని భయపడతారో, ఆశ్చర్యపడతారో లేక నవ్వుకుంటారో మీ ఇష్టం........
1) దాదాపుగా 13 సంవత్సరాల క్రితం నేను 4th class చదివేటప్పుడు వేసవి సెలవుల టైం లో ఇంట్లో బాగా బోర్ గా ఉంది....మిట్ట మధ్యాహ్నుం రెండింటికి నా క్లోజ్ ఫ్రెండ్స్ ఐన రేణు, రాధి వాళ్ళ ఇంటికి వెళదామని మా అమ్మ ని తెగ కాకా పట్టేసాను ....సరే పో అని అంది.......... ఎండలో వెళ్ళాను ofcourse ఇల్లు దగ్గరే లెండి...
నేను వెళ్ళక ముందు వాళ్ళ ఇంట్లో ....
రేణు, రాధి, మా పక్కింటి కిరీటి, పద్మ ప్రియ (అందరు చిన్న పిల్లలే పైగా అందరు పిరికోళ్ళే) కలిసి కూర్చొని ఒక దెయ్యం సినిమా చూసారట . ఆ సినిమా లో సీన్ ఏమిటంటే హీరోయిన్ ఇంట్లో ఉండగా దెయ్యం వచ్చి తలుపు కొడుతుంది .తీరా తలుపు తీసి చూస్తే ఎవరు ఉండరు....హీరోయిన్ బిక్కు బిక్కు మంటూ లోపలికి రాగానే మళ్లీ తలుపు చప్పుడు. మళ్లీ ఎవరు ఉండరు చాలా భయం భయం గా కూర్చుంటుంది హీరోయిన్. ఇంతలో కిటికీలోనుంచి మహీఈఈ ( అని గుర్తు ఆ సినిమాలో ఆ హీరోయిన్ పేరు మహి అని చూచాయగా గుర్తు మరి అసలు పేరు ఏమిటో నాకు గుర్తు లేదు ఎందుకంటే నేను ఇంతవరుకు ఆ సినిమా చూడలేదు కాబట్టి) .......మహీఈఈ అనుకుంటూ ఎర్ర చీర కట్టుకుని ఒక దెయ్యం చెయ్యి లోపలకి పెట్టి పిలుస్తుందంట వాళ్ళు ఆ సినిమా చూస్తూ వాళ్ళకి భయం వేసి కట్టేసి బిక్కు బిక్కు మంటూ కూర్చున్నారు......
ఎప్పుడు లేనిది నాకు ఎందుకు వచ్చిందో ఆ దిక్కుమాలిన ఆలోచన, ఏ నాడు లేనిది ఆ రోజే ఎందుకు పుట్టిందో ఆ దుర్బుద్ధి రేణు వాళ్ళని సరదాగా ఏడిపిద్దాం అని decide అయ్యా......నేను వచ్చిన విషయం తెలియకుండా చెప్పులు మెట్ల కిందే విడిచేసాను.. కిటికీ లో నుంచి కనపడకుండా పాక్కుంటూ వెళ్లి తలుపు కొట్టి పరిగెత్తుకుంటూ వెళిపోయి పక్కన దాక్కున్నా . ultimate గా ఏముంది ఆ సినిమా లో లాగానే తలుపు చప్పుడు అయింది తలుపు తీసి చూస్తే ఎవరు లేరు.... నలుగురికి గుండెలు ఫట్........... మళ్లీ అలానే చేశా ఈ సారి వాళ్ళు confirm అయిపోయారు దెయ్యం అని...... నేను 3rd టైం తలుపు కొట్టి అక్కడే నిలబడ్డా "భౌ" అని అరుద్దామని ఈసారి వాళ్ళు ఎంతకి తలుపు తీయలా (ఎలా తీస్తారు దెయ్యం అని ఫిక్స్ అయిపోయాక) ఇంక లాభం లేదని నేను కిటికీ కిందకి పాక్కుంటూ వెళ్లి......విధి చుడండి మరి ఎప్పుడు లేనిది నాకు ఆ వంకర బుద్ధి ఆ రోజే రావాలా???? " రెణుఊఊఊఊఊఉ" అనుకుంటూ రెడ్ టాప్ రెడ్ మిడ్డి వేసుకుని కిటికీలోనుంచి చెయ్యి పెట్టి అరిచాను ....అసలే ఆ దెయ్యం డ్రెస్ కూడా రెడ్ సారీయే కావడం తో మా ఫ్రెండ్స్ గుండెలు జారి పోయాయ్........... అంతే ఇంకా వాళ్ళు అరిచిన అరుపులు అరుపులు కావు. అసలే వాళ్ళ ఇంటి పైన వేరే ఇల్లు కూడా లేదేమో( వాళు ఉండేదే పైన) ఇంక టాప్ లేచి పోయింది.
నేనేమో పిరికి దాన్ని. దారుణమైన పిరికిదాన్ని. ఇంక వాళ్ళు దెయ్యం దెయ్యం అని అరిచేసరికి ఎక్కడ దెయ్యం నా వెనకే వచ్చిందో అనుకుని నేను కుడా అరుపులు.ఇంటిలోపల వాళ్ళు అరుపులు, బైట నేను అరుపులు. పిరికి దాన్ని తిన్నగా ఉండచ్చు కదా ఇలా ఏడిపించడం అవసరమా.... ఇంకా ఆ అరుపులకి వాళ్ళ అమ్మగారు లేచి ఏమిటర్రా నన్ను పడుకోనివ్వరా అని అరిచి తలుపు తీసారు.అమ్మ దెయ్యం అమ్మ దెయ్యం అని పాపం వాళ్ళు అరుపులు నేను అరుపులు. ఆంటీ ఏమో........ హే ఆపండి స్వాతి మీకు దెయ్యం లా కనపడుతుందా ఆపండి ఇంక అని అరిచి లోపలికి వెళ్లిపోయారు. ఆ తరువాత నేను మనిషిని కావటానికి 15 minutes పట్టింది .వాళ్ళు నన్ను ముట్టుకోవడానికి అయితే దగ్గర దగ్గర అరగంట వరకు సాహసించలేదు...
ఆ తరువాత వాళ్ళు చూసిన ఆ సినిమా గురించి చెప్పారు. అప్పటినుంచి నేను ఆ సినిమా గురించి తెలుసుకునే ధైర్యం చేయలేదు.....అంతే అప్పటినుంచి ఎంత అవసరమైనా తలుపు కొట్టాక ఎవరు ఎంత లేట్ గా తలుపు తీసినా అక్కడ నుంచి కదలను. కిటికీ లో నుంచి చూసే సాహసం అస్సలు చేయలేదు..... చెయ్యను.
2) నా వయసు దాదాపు 11 ఏళ్ళు. మా అన్నయ్య "రామ్ గోపాల్ వర్మ" తీసిన "దెయ్యం" మూవీ చూసి వచ్చాడు........ఆరోజు నేను అద్దం ముందు నుంచుని తల దువ్వుకుంటున్నా ..మా అన్నయ్య పక్కనే వచ్చి నిలబడి స్వాతి దెయ్యం మూవీ లో జే.డి.చక్రవర్తి మహేశ్వరిని నీ పేరు పెట్టే పిలుస్తాడు తెలుసా అన్నాడు......అవునా అన్నయ్య ఆ మూవీ లో దాని పేరు స్వాతి నా అన్నా .......కాదు దెయ్యం అని jerk ఇచ్చి వెళిపోయాడు.అది పరవాలేదు.సరిగ్గా దెయ్యం ఎలా ఉంటుందో , మహేశ్వరీ అద్దం ముందు నుంచుని "చిన్నీ.... దా చిన్నీ.... దా" అంటే దెయ్యం ఎలా కనిపిస్తుందో నేను అద్దం ముందు ఉండగానే సరిగ్గా angles, measurements తో సహా వర్ణించి ఆ దెయ్యం యొక్క రూప లావణ్యాన్నికుడా వర్ణించాడు. దెబ్బకి నేను ఒక 2 నెలలు అద్దం ముందు తల దువ్వుకోవడం మానేసాను.అలా మళ్లీ మామూలు మనిషిని కావటానికి 2 నెలలు పట్టింది .
కొన్నాళ్ళకి ఇల్లు మారాము ఇక్కడ దర్జాగా హాయిగా కిటికీ పక్కన పడుకునే దాన్ని. మా అన్నయ్య మళ్లీ వర్ణన మొదలు పెట్టాడు......మా అన్నయ్య స్టొరీ narration ఎంత great అంటే అది విన్న మనుషులు అందులో లీనమైపోయి ఆ place కి వెళిపోతారు........ మళ్లీ దెయ్యం మూవీ గురించే చెప్పాడు.....చిన్న పిల్లాడు కిటికీ పక్కన నుంచుని ఉంటే చేతులు వస్తాయి అని ఆ చేతులని వర్ణించాడు దెబ్బతో నేను ఆ కిటికీ పక్కన పడుకోవడం మానేసాను.......ఆ తరువాత అనిపించింది మా అన్నయ్య ఆ కిటికీ పక్కన పడుకోడానికి ఈ plan వేసి ఉంటాడా అని అప్పటినుంచి మా అన్నయ్య నే పడుకోమనేదాన్ని అప్పటిదాకా మాత్రం బైట గాలి అంత నాదే , నేను నీకు place ఇవ్వను కిటికీ పక్కన నేనే పడుకుంటాను అని ఒంటి కాలి రాకాసి లాగా లేచిన నేను దెబ్బకి కుంటి కుందేలు లాగా వేరే ప్లేస్ లో పడుకోవడం మొదలు పెట్టాను.............ఇదంతా జస్ట్ విని మాత్రమే...... చూస్తే ఇంకేమైపోయి ఉండేదాన్నో ఆలోచించనక్కర్లేదనుకుంటా .........
3) నా ఇంటర్ సెకండ్ ఇయర్ లో నా బెస్ట్ ఫ్రెండ్ అనూష ఒక మధ్యాహ్నం మా ఇంటికి వచ్చింది. కాలక్షేపం అవుతుంది కదా అని ఏదైనా సినిమా story చెప్పవే అన్నా . మా అన్నయ్య చెప్పిన way కి మనం లీనం అవుతాము అయితే...మా ఫ్రెండ్ anu అదే లీనమైపోతుంది ఆ character లో. నా ఖర్మ కొద్ది అది ఎంచుకున్న సినిమాలో హీరోయిన్ సైకో.......ఇంక నా పరిస్థితి వర్ణనాతీతం.....అది ఎంచుకున్న సినిమా "కౌన్.....తూ రు రు తూ". ఆ సినిమా లో ఊర్మిళ action ని మొత్తం చేసి చూపించింది. నా ఖర్మ కి తోడు ఆ రోజు full గాలి వర్షం సినిమా లో లాగానే.అమ్మ నిద్రకి disturbance అని లైట్స్ అన్ని off చేసుకుని కూర్చున్నా ఏమో బైట గాలీ వాన.... ఇది లీనమైపోయి చెప్పేస్తోంది. నాకు భయం start అయింది. మూవీ లో ఎవడో వచ్చి బెల్ కొడతాడు అంది. సరిగ్గా మా ఇంట్లో కూడా bell మోగింది {నా గుండె ఆగింది}. ధైర్యం చేసుకుని వెళ్లి తలుపు తీసా.
"అమ్మా portions ఏమైనా ఖాళీ ఉన్నాయా" అంటూ ఎవరో వచ్చారు నాకు తెలియదు రేపు రండి అని తలుపు వేసేసా. మా అను అలానే మూవీ చెప్పుకుంటూ పోతూ ఉంది. చాలా భయం భయం గా విన్నా.final గా ఆ సైకో... అదే ఆ హీరోయిన్ ఇంటికి వచ్చిన వాడిని ఏదో పెట్టి పొడుస్తుందంట . ఇంకా నయం దాని దగ్గర ఏమి లేవు రా బాబు హమ్మయ్య అనుకున్నా. దాని expression కే నా పని out.......అను ఇంక ఆపవే అన్నా .నేను చెప్తుంటే వినడానికి ఏమైందే నీకు అంది........పోనీ సినిమా మార్చవే అన్నా ...... నువ్వు చెప్పమన్నా చెప్పడానికి సినిమా అయిపొయింది అంది......హమ్మయ్య అనుకున్నా.
మళ్లీ మొదలుపెట్టింది....ఇప్పుడు "RAAZ" మూవీ.........ఇది అంతకంటే హారర్ మూవీ అని సినిమా మొదలు పెట్టాక కాని నాకు అర్ధం కాలేదు అసలే మనిషివి పెద్ద పెద్ద తెల్ల కళ్ళు . రూం చీకటి.......దానికి తోడు అది వైట్ కలర్ టీ షర్టు వేసుకుంది..... దాని కళ్ళు ....... అది లీనమైన తీరు చూస్తే దెయ్యమే నాతో మాట్లాడుతుంది అని అనటానికి ఏ మాత్రం doubt పడక్కర్లేని situation అది......ఆ సినిమా లో ఒక situation లో దెయ్యం హీరోయిన్ ని పట్టుకుని " i mean శరీరం లో కి ప్రవేశించి" హీరో చెయ్యి పట్టుకుంటుందట. మా ఫ్రెండ్ నా చెయ్యి పట్టుకుంది. నేను నా గుండె పట్టుకున్నాను.అలా బిక్కు బిక్కు మనుకుంటూ దాన్ని చూసుకుంటూ...... అను ఆపవే ఆపవే అంటే ఆపలేదు అది లీనమైపోయింది నాకు story మొత్తం చెప్పేదాక దానికి ఇంక నిద్ర పట్టేలాగా లేదు. ఇంక తప్పక విన్నా ఆ తరువాత నేను normal అవటానికి nearly 3-4 months పట్టింది.
అప్పటివరుకు తెరిచి ఉన్న కిటికీ అంటేనే భయం ఉండేది మా అన్నయ్య చెప్పిన దెయ్యం story మహిమ వల్ల. ఈ raaz మూవీ పుణ్యమా అని మూసి ఉన్న కిటికీ చూసినా దడ, వణుకు మొదలయ్యేవి.............ఇది కూడా విని మాత్రమే. చూస్తే కిటికీలు లేని ఇంట్లో ఉంటాను అని తీర్మానిన్చుకుని ఉండేదాన్నేమో మరి............
4) నా డిగ్రీ లో మా అన్నయ్య A film by aravind మూవీ చూసి వచ్చాడు. చూసిన వాడు తిన్నగా ఉండచ్చు కదా.......చాల బాగుంది చాల బాగుంది అని నా దగ్గర చాలా సార్లు అన్నాడు.....పిరికి దాన్ని , నా సంగతి నాకు తెలిసిన దాన్ని, నేనన్నా తిన్నగా ఉండచ్చు కదా... అది సస్పెన్సు థ్రిల్లెర్ అని తెలిసి కుడా నాకు story చెప్పవా చెప్పవా అని కెలికా. ఏముంది షరా మాములే......వినే అంత సేపు మనం లీనం........విన్నాక వేస్తుంది అసలు భయం....అంతే ఇంక ఒక్కద్దాన్నే ఎక్కడికి వెళ్ళాలన్నా భయమే......
ఇంక నా condition:
నేను: అన్నయ్య భయంగా ఉంది bed room వరుకూ తోడు రావా please........
అన్నయ్య: ఎందుకు?
నేను: భయం గా ఉంది
అన్నయ్య: ఎందుకు?
నేను: A film by aravind story చెప్పావ్ కదా అప్పటినుంచి భయం గా ఉంది
అన్నయ్య: అవును మరి...... మనది లంకంత కొంప.... ఏ గది లో నుంచి ఏ గది లోకి ఎవడు వెళ్ళింది ఎవడికి తెలియదు మరి .....ఇప్పుడు సైకో వచ్చి నిన్ను చంపేస్తుందా????????.....ఏమి అవ్వదులే కానీ వెళ్ళు
నేను: ప్లీజ్ అన్నయ్య భయం గా ఉంది
అన్నయ్య: అయినా అది ఆడవాళ్ళని ఏమి చెయ్యదు స్వాతి నువ్వు వెళ్ళు హ్యాపీ గా
పాపం ముందు రాను అనేవాడు.......... నేను ఉడుక్కునే లాగా చేసేవాడు కాని మొత్తానికి సాయం వచ్చేవాడు....అలా అమ్మ,అన్నయ్య సాయంతో ఒక నెల రోజులు భయం తో నెగ్గుకోచ్చేసా ......తరవాత తరవాత అలవాటు అయిపొయింది........
ఇవన్నీ వింటే భయపడినవి. ఇక నేను స్వయం గా చూసి వణికిపోయిన సినిమాలూ ఉన్నాయ్........మీకు డౌట్ రావచ్చు ఇంత పిరికిది మూవీస్ చూసి బ్రతికే ఉందా అని........బ్రతికే ఉన్నాను అదేంటో మరి నాకూ డౌటే ఎలాగా అని....
వాటి వివరాలు వచ్చే సంచికలో... i mean వచ్చే టపాలో :)
Subscribe to:
Posts (Atom)
